కళ్యాణలక్ష్మి పథకంలో నకిలీ రశీదుల బాగోతం!

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కళ్యాణలక్ష్మి పథకంలో నకిలీ రశీదుల బాగోతం!

ములుగు జిల్లాలో వెలుగుచూసిన అక్రమ దరఖాస్తులు..

ములుగు జిల్లా ఏటూరునాగారంలో కళ్యాణలక్ష్మి పథకాన్ని దుర్వినియోగం చేసేందుకు నకిలీ వివాహ రశీదులు, ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

బూటారంకు చెందిన అఖిల్ అనే వ్యక్తి 2025లో వివాహం జరిగినట్లు నకిలీ రశీదులు సృష్టించి కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అధికారుల విచారణలో అసలు విషయం బయటపడింది. అతనికి 2022లోనే వివాహం జరగ్గా, రికార్డుల్లో 2025గా మార్చి దరఖాస్తు చేసినట్లు తేలింది.

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అక్రమంగా పొందేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.