బాగ్ లింగం పల్లి ఎల్ ఐ జి క్వార్టర్స్ లో మంచి నీటి కాలుష్యాని అరికట్టాలి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..బాగ్ లింగం పల్లి ఎల్ ఐ జి క్వార్టర్స్ లో మంచి నీటి కాలుష్యాని అరికట్టాలి…

ఆచ్చయ్య నగర్ బస్తీ లో ఉన్న గ్యాస్ గోడౌన్ ను ఎత్తి వేయాలి…..

సీపీఎం డిమాండ్

ప్రజా సమస్యలపై సిపిఐఎం ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు అచ్చయ్య నగర్, ఎల్ ఐ జి క్వార్టర్స్ లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది.
ఈ పాదయాత్ర కు ముఖ్య అతిధిగా హాజరైన సిపిఐఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం. దశరథ్ మాట్లాడుతు బాగ్ లింగంపల్లి డివిజన్ పరిధిలోని ఎల్ ఐ జి క్వార్టర్స్ లో కొన్ని నెలల నుండి మంచి నీటిలో డ్రైనేజీ వాటర్ కలిసి వాసనతో వస్తున్నదాని, కాలనీ వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోడంలేదని విమర్శించారు. ప్రజలకు సరఫరా చేస్తున్న నీటిని వాటర్ వర్క్స్ అధికారులు తాగుతారని ప్రశ్నించారు. వెంటనే ఎల్ ఐ జి క్వార్టర్స్ లోని మంచినీటి కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేసారు. బస్తీలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కొన్ని కృంగి పోయి ఉన్నాయని వాటిని మార్చాలని కోరారు.

ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్. వెంకటేష్ మాట్లాడుతు అచ్చయ్య నగర్ బస్తీ లో ఉన్న గ్యాస్ గోడౌన్ ను అక్కడి నుండి తీసివేయాలని డిమాండ్ చేసారు. బస్తీ లో సివిల్ సప్లై గోడౌన్ ఉండటం మూలంగా ఇళ్ల లోకి లక్కాపురుగులు, ఎలుకలు వస్తున్నాయని దీని ద్వారా బస్తీ వాసులకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. బస్తీ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బస్తీ నుండి తరలించాలని డిమాండ్ చేశారు.
ఈ పాదయాత్ర కార్యక్రమం లో జోన్ కార్యదర్శి వర్గ సభ్యులు కె. రమేష్, జోన్ కమిటీ సభ్యులు ఆర్. వెంకటమ్మ, నాయకులు వీరయ్య, మల్లయ్య, నాగేశ్వరరావు, వెంకటేష్, శంకరయ్య, శ్రీను, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

ధన్యవాదములతో,
కె. రమేష్
కార్యదర్శివర్గ సభ్యులు
సిపిఐఎం ముషీరాబాద్ జోన్ కమిటీ