ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఎస్‌టీపీలు, ట్రీటెడ్ వాటర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీక్ష.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఎస్‌టీపీలు, ట్రీటెడ్ వాటర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీక్ష.

హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేష్ వి. పాటిల్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి.

సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..

ట్రీటెడ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో ఏఐ టెక్నాలజీని వినియోగించాలి.

నీటి నాణ్యతపై రాజీ పడొద్దు.

ప్రతి ప్లాంట్ దగ్గర స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలి.

ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలి.

ఈ ప్లాంట్లపై హైడ్రా మానిటరింగ్ ఉండాలి.

ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ల్యాండ్‌స్కేప్‌లు, రోడ్ క్లీనింగ్‌కు ట్రీటెడ్ వాటర్‌ను మాత్రమే వాడాలి.

సెక్రటేరియట్, సీఎం కార్యాలయం ల్యాండ్‌స్కేప్‌లతో పాటు పబ్లిక్ పార్కుల్లో కూడా ట్రీటెడ్ వాటర్ వినియోగించాలి.

రైల్వే డిపార్ట్‌మెంట్‌తో పాటు మెట్రో రైల్‌ను కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలి.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర అవసరాల కోసం వంద శాతం ట్రీటెడ్ వాటర్‌ను వాడాల్సిందే. దీన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వాలి.

ట్రీటెడ్ వాటర్ ట్యాంకర్లను ట్రాక్ చేయాలి.

దీనిపై విస్తృత ప్రచారం జరగాలి.

ట్రీటెడ్ వాటర్ కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి.

ట్రీటెడ్ వాటర్‌నే వినియోగించాలని భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే నిబంధన విధించాలి.

ట్రీటెడ్ వాటర్ ప్లాంట్లను సోలార్ పవర్‌తో నడిపే అవకాశాలను పరిశీలించాలి.

ప్రైవేట్ ఎస్‌టీపీలను ప్రోత్సహించాలి.

డేటా సెంటర్లకు కూడా ట్రీటెడ్ వాటర్ అందించాలి.

నవంబర్ 1 నుంచి డిసెంబర్ ఆదేశాలు అమలయ్యేలా చూడాలి.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చర్యలు ఉండాలి.

ఎట్టి పరిస్థితుల్లో మంచి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి.

మంచి నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ జరగాలి.

అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దు..