ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. 17 చోట్ల ఏకగ్రీవం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. 17 చోట్ల ఏకగ్రీవం

మున్సిపల్ ఎన్నికల్లో 17 చోట్ల ఏకగ్రీవం కాగా, టీడీపీ 15 మున్సిపాలిటీలను, జనసేన, బీజేపీ ఒక్కో స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నాయి. 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, వార్డుల్లో కూటమి పార్టీలకు చెందిన 726 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

టీడీపీ 660, జనసేన 38, బీజేపీ 28 వార్డుల్లో ఏకగ్రీవం కాగా, వైసీపీ 19, సీపీఐ ఒకటి, ఇండిపెండెంట్లు ఐదు వార్డుల్లో ఏకగ్రీవమయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో ఆరు చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

మొత్తం వార్డుల్లో 21.08 శాతం, డివిజన్లలో 12.58 శాతం ఏకగ్రీవాలు నమోదయ్యాయి.