ఈసీకి విశ్రాంత న్యాయమూర్తుల మద్దతు

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….ఈసీకి విశ్రాంత న్యాయమూర్తుల మద్దతు

దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం నిర్ణయాలపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో 42 మంది విశ్రాంత న్యాయమూర్తులు ఈసీకి మద్దతుగా బహిరంగ లేఖ రాశారు.

భారత రాజ్యాంగబద్ధ సంస్థలపై నిరంతర దాడులు జరుగుతున్నాయని, ముఖ్యంగా ఎన్నికల సంఘం ఈ దాడులకు కేంద్రబిందువుగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ, వాటిని కించపరచకూడదని విశ్రాంత న్యాయమూర్తులు తమ లేఖలో పేర్కొన్నారు….