నవంబర్ 2 నుంచి సదరం స్లాట్ బుకింగ్

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..నవంబర్ 2 నుంచి సదరం స్లాట్ బుకింగ్

AP: రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం సదరం స్లాట్ బుకింగ్ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.

2 నెలల గడువుతో సుమారు 40 వేల మందికి ఆన్లైన్లో అవకాశం కల్పిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇందుకు ఎన్నికల సంఘం అనుమతి లభించింది.

వాట్సాప్ మనమిత్ర, సచివాలయాలతో పాటు AP సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

స్లాట్ తీసుకొని 6 నెలల్లోగా పరీక్షలకు హాజరు కాకుంటే వివరాలు తొలగిపోతాయని అధికారులు తెలిపారు.