2027, ఫిబ్రవరి 16 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….2027, ఫిబ్రవరి 16 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2027 విద్యా సంవత్సరానికి పదో, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది.

ఫిబ్రవరి 16న పెయింటింగ్ పరీక్షతో థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10:30 గంటలకు పరీక్షలు నిర్వహించనున్నారు.

పదో తరగతి పరీక్షలు మార్చి 9తో, పన్నెండో తరగతి పరీక్షలు ఏప్రిల్ 9తో ముగుస్తాయి. పూర్తి టైమ్ టేబుల్ ను అధికారిక వెబ్సైట్లో పొందవచ్చు.