భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఎన్నికల ఫలితాల వివరాలపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
• 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీఏ బలం పుంజుకుంది.
• స్థానిక సంస్థల్లో పట్టణాలు, పరిషత్ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 58.9 ఓట్ల శాతాన్ని సాధించింది.
• 2024 ఎన్నికల్లో ఇది 55.3 శాతం-2024తో పోలిస్తే స్థానిక ఎన్నికల నాటికి ఎన్డీఏకు 3.6% ఓట్లు పెరిగాయి.
• స్థానిక ఎన్నికల్లో మొత్తంగా 33.56 శాతం వైసీపీకి పడ్డాయి.
• 2024 ఎన్నికలలో 39.81 శాతం వచ్చాయి.
• 2024తో పోలిస్తే వైఎస్సార్సీపీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయి.
• మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి-వైసీపీకి మధ్య 25.34 శాతం మేర గ్యాప్ ఉంది.
• పట్టణాల్లో ఎన్డీఏ ఓట్ షేర్ 59.9 శాతం-వైఎస్సార్సీపీ 34.3శాతం-ఎన్డీఏ స్ట్రైక్ రేట్ 94 శాతం.
• జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ షేర్ 57.6 శాతం-వైసీపీ 39.7 శాతం-ఎన్డీఏ స్ట్రైక్ రేట్ 87.5 శాతం.
• పట్టణాల్లో 25.60 శాతం, పల్లెల్లో 17.9 శాతం మేర కూటమికి-వైసీపీకి ఓట్ల శాతంలో వ్యత్యాసం ఉంది.
• ఇక ఎంపీటీసీల విషయానికొస్తే.. 9818 స్థానాలకు గానూ కూటమి 7803 స్థానాలను దక్కించుకుంది.
• రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూటమి గెలుచుకునే అవకాశం.
• స్థానిక ఎన్నికల్లో పట్టణాల్లో ఎన్డీఏకు పడ్డ పోస్టల్ బ్యాలెట్లు 65.7 శాతం-వైసీపీకి 27.42 శాతం.
• పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏ 62.83 శాతం పోస్టల్ బ్యాలెట్లు పడితే.. వైసీపీకి 31.46 శాతం పడ్డాయి.
• మొత్తం 659 జెడ్పీటీసీలకు గానూ.. 575 స్థానాలను కూటమి గెలుచుకుంది.
• జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యత సాధించింది.
• అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీకి కూటమి కంటే ఎక్కువ సీట్లు సాధించింది.
• 7 జిల్లాల్లో వైసీపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదు.
• అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీకి ఒక్క జడ్పిటిసి కూడా రాలేదు.
