భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🪷🙏🪷🦢🦚
మౌంజీయుక్ ఛాత్రకో దండీ
కృష్ణాజినధరో వటుః।
అధీతవేదో వేదాంతోద్ధారకో
బ్రహ్మ నైష్ఠికః॥
శ్లోకార్థం:
మౌంజీయుక్
మౌంజి (ముంజ గడ్డితో చేసిన మొలతాడు) ధరించినవాడు.
ఛాత్రకో
గొడుగు పట్టుకున్న విద్యార్థి.
దండీ
చేతిలో బ్రహ్మదండం పట్టుకున్నవాడు.
కృష్ణాజినధరో వటుః
నల్ల జింక చర్మాన్ని ధరించిన చిన్న బ్రహ్మచారి (వటువు) – సాక్షాత్తు వేంకటేశ్వరుడే చిన్న పిల్లాడిలా!
అధీతవేదో
వేదాలన్నీ చదివినవాడు.
వేదాంతోద్ధారకో
వేదాంతాన్ని ఉద్ధరించేవాడు – వేదాల సారాన్ని కాపాడేవాడు.

బ్రహ్మ నైష్ఠికః
బ్రహ్మ జ్ఞానంలో నిష్ఠ కలవాడు.
శ్లోక భావార్ధం:
వేంకటేశ్వరుడు ఈ శ్లోకంలో “చిన్న పిల్లాడి” లాగా ఉన్నాడు.
వటువు, అంటే చేతిలో కర్ర, నడుముకు మొలతాడు, ఇంకొక చేతిలో గొడుగు పట్టుకుని బుడి బుడి అడుగులు వేసే బాల బ్రహ్మచారి.
సకల కోటి బ్రహ్మాండాలను కాపాడే భగవంతుడు కూడా ఆడంబరాలు లేకుండా సాధారణ చిన్న పిల్లాడిలాగా ఉంటాడు అని ఈ శ్లోకం చెబుతోంది.
ఈరోజు శనివారం:
“ఓం బ్రహ్మ నైష్ఠికాయ నమః”
“ఓం వేదాంతోద్ధారకాయ నమః”
అని 21 సార్లు జపించండి.
ఆ, వేంకటేశ్వరుడే మీ చేయి పట్టుకుని, మిమ్మల్ని విజయం వైపుకు అడుగులు వేయిస్తాడు.
🦜మిత్రులకు,స్థిరవాసర శుభోదయం.🦜