భారత్ డిజిటల్ న్యూస్ భక్తినేడు తిరుమలకు ప్రైవేటు వాహనాల బంద్
తిరుమల :
తిరుమలలో శ్రీవారి గరుడ వాహనసేవ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు (శుక్రవారం) ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని శనివారం ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ప్రైవేట్ వాహనాలు నిలిపివేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
