భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…హరే రామ – హరే కృష్ణ….!!
ద్వాపర యుగం ముగిసి కలి ప్రవేశించే తరుణంలో నారదుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి” తండ్రీ ! ఇంతవరకూ సకల లోకాలలో స్వేఛ్ఛగా సంచరిస్తూ వచ్చే నేను దోషభూయిష్టమైన కలియుగంలో ఎలా మనగలను? మార్గాంతరం సూచించండి ” అని అడిగాడు.
దానికి బ్రహ్మదేవుడు
సర్వసమర్ధుడైన నారాయణుని నామము జపించినంత మాత్రముననే కలి వున్న చోటు కనిపించకుండా పోతుంది” అని అన్నాడు.
“అటువంటి నామము ఏది ? ” అని నారదుడు అడుగగానే బ్రహ్మదేవుడు,
🌹🙏'”హరేరామ ! హరే రామ రామ రామ హరే హరే!
హరే కృష్ణ !హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!” 🙏🌹
అని జపిస్తే చాలు కలిదోషం నివారిస్తుంది. సకల వేదాలు యిది తప్ప వేరే దారి లేదని చెప్తున్నవి” అని బదులు యిచ్చాడు.
బ్రహ్మ. “కలిచంద్రనోపనిషత్తు” లో బ్రహ్మదేవుడు , నారద మహర్షిల మధ్య జరిగిన ఈ సంభాషణలు వివరించబడివున్నాయి…

