భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
AP: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇరువురు నేతలకు ఈ సుదీర్ఘ చట్టపరమైన వివాదం నుండి పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

