కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన జడ్పిటిసి, ఎంపిటిసి పోలింగ్ ప్రక్రియ

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..కృష్ణా జిల్లా పోలీస్

కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన జడ్పిటిసి, ఎంపిటిసి పోలింగ్ ప్రక్రియ

  • ఏ చిన్న సంఘటనకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తి
  • విధుల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు
  • కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి

కృష్ణా జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఏ చిన్న సంఘటనకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ముగిసింది. ప్రజలు తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ, ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మెరైన్ నుండి ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన వారికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే స్ఫూర్తితో రానున్న కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీస్ శాఖకు తమ సహాయ సహకారాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇదే కాకుండా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్, మూడు దశల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలు పోలింగ్, కౌంటింగ్ కు ఇదే విధంగా సహకరించాలని కోరారు.