డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్, ఏలూరు శ్రీమతి బి. శ్రీలత గారు ,

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్, ఏలూరు శ్రీమతి బి. శ్రీలత గారు , అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ (ఎన్‌ఫోర్స్‌మెంట్), ఏలూరు శ్రీ కె.వి.ఎన్. ప్రభు కుమార్ గారు మరియు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, ఏలూరు జిల్లా శ్రీ ఏ. ఆవులయ్య గారు ఆదేశాల ప్రకారం

చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది కలిసి చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో దాడులు నిర్వహించగా పాత నాటు సారాయి కేసులో పరారి లో ఉన్న బాణావతు పిచ్చెమ్మ అను మహిళ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినారు!

అలాగే ఈ రోజు చింతలపూడి మండలం లో గల పలు మద్యం దుకాణాలలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మద్యం స్టాక్ ​ఎక్సైజ్ డిపో (APSBCL) నుండి వచ్చిన హోలోగ్రామ్/క్యూఆర్ కోడ్‌ లను కొన్ని మద్యం సీసాలు ఏ.పి.సురక్ష ఆన్లైన్ యాప్ ద్వారా సాధారణంగా పరిశీలించి , మద్యం అమ్మకాలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జరపాలని సూచనలు ఉల్లంఘించరాదని, సక్రమముగా పూర్తి నియమాలు/ చట్టాలు పాటించవలసినదిగా మద్యం షాపులోని సేల్స్ సిబ్బందికి తెలిపినారు!

ఈ దాడులలో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ. అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ. పి. అశోక్ తెలిపారు!