భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం : జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపిఎస్ గారు
మహిళలు,యువతులు,బాలికలు ఆకతాయిల వలన గానీ,మరే విధమైన వేధింపుల వలన గానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస్ రావు, ఐపిఎస్ గారు
తెలిపారు
.జిల్లాలో మహిళల రక్షణ కోసం షీటీమ్స్,యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు,మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్,ఈవ్ టీజింగ్ లకు గురైనా,మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా,బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా వెంటనే నిర్భయంగా షీ టీమ్ పోలీసులను ఆశ్రయిస్తే సత్వర న్యాయం చేకూరుస్తామని అయన తెలిపారు. అక్టోబర్ నెలలో షీటీమ్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 24 అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అని, మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్,వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని,వాటిలో ఫొటోలు,వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నేరుగా సంప్రదించలేని వారు 8712670312 ఫోన్ నంబరుకు లేదా డయల్ 112కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు..జిల్లా వ్యాప్తంగా గత నెలకు సంబంధించి షీటీమ్స్ 14, పెట్టి కేసులు నమోదు చేయడం జరిగింది, 14మంది వ్యక్తులకీ కుటుంబ సభ్యుల ముందు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. 104 హాట్స్పాట్ నిఘా వుంచాగా 14 మంది పోకిరిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కుటుంబ సభ్యుల ముందు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న వారు T. SAFE APP వినయోగించుకోవాలని, మీ ప్రయాణం లో భరోసా ఇస్తుంది అని తెలిపారు. అమ్మాయిలను ఎలాంటి వేధింపులకు గురి చేసి.. పట్టుబడితే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, జోగులాంబ గద్వాల్ జిల్లా.