భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,
క్రైమ్ న్యూస్ కృష్ణా :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి పరిష్కరించాలని ఆదేశించారు.
సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖను ఆశ్రయించే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఈరోజు మీకోసం కార్యక్రమానికి మొత్తం 52 ఫిర్యాదులు రాగా అందులో ముఖ్యమైనవి
▪️మచిలీపట్నం నుండి రహిమ అనే మహిళ వచ్చి తనకు వివాహం జరిగే రెండు సంవత్సరాలు అవుతుందని ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తన భర్త అత్తింటి వారు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.
▪️అవనిగడ్డ నుండి రాఘవయ్య అనే వృద్ధుడు వచ్చి తనకు ఇద్దరు మగ పిల్లలు కలరని తన భార్య మరణించిన నాటినుండి తన కుమారులు కోడళ్ళు కనీసం భోజనం కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఆస్తి పంపకాలు జరపకపోతే ఇంటి నుండి గెంటి వేస్తామని బెదిరిస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.

▪️కంకిపాడు నుండి రవి అనే యువకుడు వచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపడంతో తన దగ్గర బంధువునికి మూడు లక్షలు ఇచ్చానని ఉద్యోగం గురించి సంవత్సరం నుంచి అడుగుతున్నా సమాధానం లేదని న్యాయం చేయమని ఫిర్యాదు.