భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..CJP నిరసనలో గుండెపోటుతో వ్యక్తి మృతి
CJP నిరసనలో పాల్గొంటుండగా గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే, ఈ నిరసనకు మద్దతుగా అక్కడికి వెళ్లిన ఒక వ్యక్తి మరణించారు. ఆయనను థానేలోని ‘దోస్తి వెస్ట్ కౌంటీ’కి చెందిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్ళైగా గుర్తించారు. నిరసనను పరిశీలించేందుకు ఆయన శుక్రవారం సాయంత్రం శివాజీ పార్క్‌కు వెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనకు ఛాతీ నొప్పి మొదలైంది. పోలీసులు ఆయనను ‘శుశ్రూష ఆసుపత్రి’కి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం.
