భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..గుడివాడలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.. 54 మద్యం సీసాలు స్వాధీనం!
ఎన్నికల నేపథ్యంలో గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు
కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం:
ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాల నియంత్రణే లక్ష్యంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2026 అక్టోబర్ 25వ తేదీన అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సీహెచ్. లావణ్య ఆదేశాల మేరకు విజయవాడ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో గుడ్లవల్లేరు మండలంలో పంచుమర్తి సురేష్ వద్ద 54 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వరమ్మ తెలిపారు.
ఈ తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ జి. ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ పి. చెన్నారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలో అక్రమ మద్యం నిల్వలు, విక్రయాలపై నిఘా కొనసాగిస్తూ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.