భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..మహిళల జోలికొస్తే ఊరుకోను: సీఎం విజయ్ వార్నింగ్ …

Ammiraju Udaya Shankar.sharma News Editor…తనను ఏమైనా అన్నా భరిస్తానని, మహిళల జోలికొస్తే మాత్రం ఊరుకోనని తమిళనాడు సీఎం, టీవీకే అధ్యక్షుడు విజయ్ హెచ్చరించారు. ధారాపురం ఉపఎన్నిక ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..
DMK సహా ఇతర పార్టీలకు ఓటేయడం అంటే మహిళలను అవమానించిన వారికి మద్దతివ్వడమేనని ఇప్పటికే చెప్పినట్లు గుర్తుచేశారు. టీవీకే అభ్యర్థి సత్యభామపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను విజయ్ తప్పుబట్టారు. డీఎంకే నేతలు కూడా అదే తరహాలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు…
