ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

LMD తిమ్మాపూర్‌కు అనిల్‌.. జగిత్యాల జిల్లా కోరుట్లకు తిరుపతి

మల్టీ జోన్‌-1 పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీపీ చంద్రశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

రామగుండం సీసీఆర్‌బీలో పనిచేస్తున్న బి. అనిల్‌ను కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ సర్కిల్‌కు, కరీంనగర్‌ సీపీసీలో పనిచేస్తున్న కొమ్ము తిరుపతిని కోరుట్ల సర్కిల్‌కు బదిలీ చేశారు.

తిమ్మాపూర్‌లో పనిచేస్తున్న బొల్లం రమేష్‌ ఇటీవల సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే. కోరుట్లలో పనిచేసిన లక్ష్మీనారాయణను గతవారం మల్టీ జోన్‌ కార్యాలయానికి బదిలీ చేశారు.