కృష్ణాజిల్లాలో మూడు జడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరణ

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణాజిల్లాలో మూడు జడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరణ..❗

కృష్ణాజిల్లా పరిధిలోని జడ్పీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్ ఈరోజు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 జడ్పీటీసీ స్థానాలకు 197 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ పత్రాలను పరిశీలించిన అధికారులు 3 నామినేషన్లను తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వాటిలో టీడీపీ 2, బీజేపీ 1 గా ఉన్నాయి. మిగతా 194 నామినేషన్లను అధికారులు ఆమోదించారు.