సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు క్షేమం.. అధికారుల సమన్వయంతో రక్షణ

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు క్షేమం.. అధికారుల సమన్వయంతో రక్షణ

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు ఇంజన్ చెడిపోవడంతో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

స్థానిక మత్స్యకారుల సహకారంతో అలల ఉధృతిని ఎదుర్కొని ఏడుగురినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.