భక్తిశ్రద్ధలతో సాయి దివ్య రథానికి స్వాగతం పలికిన పెదపాలపర్రు పుట్టపర్తి సాయి సేవాసమితి

ఏలూరు జిల్లా ముదినేపల్లి :::: భారత్ డిజిటల్ న్యూస్ ప్రతినిధి :::: భక్తిశ్రద్ధలతో సాయి దివ్య రథానికి స్వాగతం పలికిన పెదపాలపర్రు పుట్టపర్తి సాయి సేవాసమితి చల్లగుళ్ల వెంకటేశ్వరరావు పద్మావతి దంపతులు మరియు తిరువీధుల పాండురంగారావు దంపతులు, వారి కుమారుడు వెంకటరత్నం దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పుట్టపర్తి సాయిబాబా దివ్య రథం భారతదేశం అంతా తిరిగి ఏలూరు జిల్లాలో భక్తుల ఆశీస్సులు నీరాజనాలు అందుకుంటూ ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి ఈరోజు తెల్లవారుజామున విచ్చేసిన శ్రీ సాయి దివ్య రథానికి గ్రామస్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి వారపోసి స్వామివారి దివ్యపాదుకుల దర్శనాన్ని సందర్శించి పూర్ణకుంభంతో వేదమంత్రాలతో స్వామివారి రథయాత్రను దిగ్విజయవంతంగా ఏలూరు జిల్లాలో పూర్తిచేసి కృష్ణాజిల్లా సాయి సత్సంగ్ పరివార్ సాయి సేవకులకు దివ్య రధాన్ని పూర్ణకుంభ కలశాన్ని కృష్ణాజిల్లా భక్తుల సేవ నిమిత్తం అందించారు. పెదపాలపర్రు గ్రామస్తులకు, పుట్టపర్తి సాయిబాబా సత్సంగ్ భక్తులందరికీ కూడా వేద పండితులు తమ ఆశీర్వచనాలని అందించి సాయి సందేశాలైన ప్రేమ శ్రద్ధ భక్తి అలవర్చుకుని సాయి మార్గంలో నడవాలని విశేషంగా సాయి ఆశీస్సులు అందరికీ ఉండాలని వేద పండితులు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో సాయి సత్సంగ్ పరివార్ భక్తులు పాల్గొని అల్పాహార విందుని భక్తులకు అందించారు