రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్న చంద్రబాబు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..తాడేపల్లి.

రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్న చంద్రబాబు
అందుకోసం స్థానిక ఎన్నికల్లో అష్ట కుట్రల పర్వం
:శ్రీ వైయస్‌ జగన్‌ ఫైర్‌ «

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల హింసాకాండ. వైయస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైయస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా నిరోధించడం. వారి నామినేషన్‌ పత్రాలు చించేయడం. మరోవైపు యథేచ్ఛగా సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ). రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా వైయస్సార్‌సీపీ అభ్యర్థులపై అక్రమ కేసులు, అరెస్టులు, పోలీసుల బెదిరింపులు.. తదితర అంశాలపై సాక్ష్యాధారాలతో సహా మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌.

సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం యథేచ్ఛగా బేఖాతర్‌
ఏ మాత్రం పట్టించుకోని ఎస్‌ఈసీ. రాష్ట్ర ప్రభుత్వం
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో మరింత దారుణం
:శ్రీ వైయస్‌ జగన్‌ ధ్వజం

కాబట్టి, తిరగ బడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొండి
లేకపోతే ఏ ఒక్కరి ఆస్తులు, స్వేచ్ఛ, హక్కులకు గ్యారెంటీ లేదు
ఇలాంటి క్రిమినల్స్‌ చేతిలో అధికారం శ్రేయస్కరం కాదు
చంద్రబాబు చేస్తున్నవి దారుణ కుట్రలు, కుతంత్రాలు
అవి ప్రజాస్వామ్యం ఖూనీనే కాదు. దారుణమైన నేరం
అందుకే ఈ ప్రజాస్వామాన్ని కాపాడుకోవాలి
:శ్రీ వైయస్‌ జగన్‌ పిలుపు

ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ప్రజా హక్కులు
నియంతృత్వ వ్యవస్థలో హక్కులు, స్వేచ్ఛ నిల్‌
కాబట్టి ప్రజలంతా ఆలోచించాలి
రేపు మీ ఆస్తులను ఇలాగే లాక్కుంటారు
:శ్రీ వైయస్‌ జగన్‌ హెచ్చరిక

అన్ని కుట్రలకు పితామహుడు చంద్రబాబు
తారాస్థాయికి ఆయన ఫోర్జరీ, మోసాలు, కుట్రలు
తొండి. అన్యాయం. దౌర్జన్యంతో స్థానిక ఎన్నికలు
ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా పాతర వేస్తున్నారు
నియంతృత్వ ధోరణితో ముందుకెళ్తున్న చంద్రబాబు
:శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపణ

చంద్రబాబు కుట్రలో మరో పరాకాష్ట
వైయస్సార్‌సీపీ పేరుతో ఫేక్‌ నామినేషన్లు
ఒక్కరోజులోనే నామినేషన్లలో 500 శాతం పెరుగుదల
ఎన్నికల కమిషన్‌ డేటాలో ప్రత్యక్షం. అవన్నీ ఫేక్‌
వారెవ్వరూ వైయస్సార్‌సీపీ అభ్యర్థులు కారు
:శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

ఈ ఎన్నికల్లో దుర్మార్గాలు ఎదుర్కొంటున్న పార్టీ అభ్యర్థులు
వారికి తోడుగా నిలబడుతున్న నాయకులు, నేతలు
అండగా నిలుస్తున్న పార్టీ న్యాయ, వివిధ విభాగాలు
ముఖ్యంగా గట్టిగా నిలబడి పోరాడుతున్న నా అక్కచెల్లెమ్మలు
:వీరందరికీ నా హ్యాట్సాఫ్‌. శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి

ఇప్పుడు తప్పు చేస్తున్న ఎవ్వరినీ వదలబోము
రేపు వారు అన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది
వారందరికీ తగిన శిక్ష తప్పదు
ఈ విషయం గుర్తుంచుకొండి
:ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన శ్రీ వైయస్‌ జగన్‌

తాడేపల్లి:
రాష్ట్రంలో అన్నింటా విఫలమైన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, అందుకే స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి, ఎలాగైనా గెలిచేందుకు అంతులేని అక్రమాలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్న చంద్రబాబు, ఆ దిశలో స్థానిక ఎన్నికల్లో అష్ట కుట్రలు చేస్తున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం యథేచ్ఛగా బేఖాతర్‌ చేస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) కానీ, ప్రభుత్వం కానీ వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ««వెల్లడించారు.
అన్ని కుట్రలకు పితామహుడు చంద్రబాబు అని, ఆయన ఫోర్జరీ, మోసాలు, కుట్రలు తారాస్థాయికి చేరాయని తెలిపారు. తొండి, అన్యాయం. దౌర్జన్యంతో స్థానిక ఎన్నికలు గెలవాలని చూస్తున్నారని, అలా ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా పాతర వేస్తున్న చంద్రబాబు, నియంతృత్వ ధోరణితో ముందుకెళ్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ప్రజా హక్కులు ఉంటాయని, నియంతృత్వ వ్యవస్థలో హక్కులు, స్వేచ్ఛ ఉండవన్న ఆయన, కాబట్టి ఈ విషయంపై ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ‘ఈరోజు పోలీసులు, అధికారుల సమక్షంలోనే నామినేషన్‌ పత్రాలు లాక్కుంటున్న టీడీపీ గుండాలు, రేపు ప్రజల ఆస్తులను కూడా అలాగే లాక్కుంటారని శ్రీ వైయస్‌ జగన్‌ హెచ్చరించారు.
అందుకే ప్రజలంతా తిరగ బడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, లేని పక్షంలో ఏ ఒక్కరి ఆస్తులు, స్వేచ్ఛ, హక్కులకు రాష్ట్రంలో గ్యారెంటీ లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు.