అక్టోబర్ 15 తర్వాత ఏపీలో వర్షాలు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అక్టోబర్ 15 తర్వాత ఏపీలో వర్షాలు

ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి వాయుగుండం లేదా తుఫానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో అక్టోబర్ 15 తర్వాత ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగి, సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది.