భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..చింతలపూడి మున్సిపల్ చైర్ పర్సన్ రేసులొ టీడీపీ మహిళా నేత చాపల లీలా ప్రశాంతి
ఏలూరు జిల్లా..
చింతలపూడి మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం కోసం పోటీ ఆసక్తికరంగా మారుతోంది, టీడీపీ మహిళా నాయకురాలు చాపల లీలా ప్రశాంతి చైర్ పర్సన్ ఆశావహిగా బరిలోకి దిగారు,
ఈ మేరకు ఆమె చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు,
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన లీలా ప్రశాంతి, చివరి నిమిషంలొ అవకాశం దక్కకపోవడంతొ వెనక్కి తగ్గారు, ప్రస్తుతం మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతొ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు,

పార్టీ కోసం చేసిన సేవలు, మహిళా నాయకురాలిగా ఉన్న పట్టు, రిజర్వేషన్ అంశం కలిసి రావడంతొ ఈసారి తనకు అవకాశం దక్కుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.