భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..నామినేషన్ వేసేందుకు వెళ్తే మా వాళ్లను అడ్డుకుంటున్నారు.. పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకోవడం లేదు.. చంద్రబాబు నాయుడు అధర్మ, రక్తచరిత్ర రాస్తున్నారు.. కనీసం నామినేషన్ వేసే పరిస్థితి లేదు.. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?.. రెండ్రోజుల కిందటే రిజర్వేషన్లు వచ్చాయి.. రెండ్రోజుల గ్యాప్‌లో నామినేషన్లు మొదలయ్యాయి.. నామినేషన్లు వేయడినికి మూడ్రోజులే ఇచ్చారు.. నామినేషన్లు వేద్దామంటే అడ్డుకుంటున్నారు: వైఎస్ జగన్
ప్రజల మద్దతు మీకుంటే మా అభ్యర్థులను ఎందుకు అడ్డకుంటున్నారు?.. ఎందుకు హత్యాయత్నాలు చేయిస్తున్నారు?.. పోలీసులతో కేసులు పెట్టించి మా అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు?.. వాళ్లకు కావాల్సిన చోట రిజర్వేషన్లు తీసుకొచ్చారు.. అయినా ఫేయిర్గా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదు.. SIRలో 44 లక్షల ఓట్లు తొలగించారు.. తుది జాబితా రాకముందే స్థానిక ఎన్నికలు ప్రకటించారు.. ఇష్టానుసారం వార్డులను విభజించారు: వైఎస్ జగన్
బైండోవర్ల పేరుతో పిలిచి కేసులు పెట్టారు.. కూటమి పార్టీలకు చంద్రబాబు తన పార్టీ మనుషులను పంపుతున్నారు.. రెండేళ్లు దాటినా బదిలీలు లేవు.. నామినేషన్ సెంటర్ల దగ్గర టీడీపీ నేతలు గుమిగూడినా పట్టించుకోరు.. టీడీపీ నేతలు నామినేషన్ పత్రాలు లాక్కుంటున్నా పోలీసులు పట్టించుకోరు.. మా హయాంలో స్థానిక ఎన్నికలు జరిగితే నిమ్మగడ్డ రమేష్ ఎస్ఈసీగా ఉన్నారు.. నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు భక్తుడు.. నిమ్మగడ్డకు అధికారం ఉందని కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశారు.. అయినా 98 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్నాం: వైఎస్ జగన్

సీఎం చంద్రబాబుకు నిజాయితీగా ఎన్నికలు జరిపే ధైర్యం లేదు.. ప్రస్తుత ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఒకప్పుడు చంద్రబాబు దగ్గర సీఎస్‌గా పనిచేశారు.. 2019లో ఈసీ ముగ్గురు అధికారులను ఎన్నికల విధుల్లో నుంచి తీసెయ్యాలని ఆదేశించింది.. అప్పుడు చంద్రబాబు కోర్టుకు వెళ్తే, కోర్టు కూడా ఒప్పుకోలేదు.. అప్పుడు సీఎస్‌గా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను ఈసీ తొలగించింది.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు పునేఠా.. అనిల్ చంద్ర రిటైర్ అయ్యాక మళ్లీ ఎస్ఈసీగా నియమించారు: వైఎస్ జగన్