వైయస్ఆర్సీపీ ఎంపీపీ అభ్యర్థిగా రెండో సెగ్మెంట్లో నామినేషన్ వేసిన యాదవరెడ్డి

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..వైయస్ఆర్సీపీ ఎంపీపీ అభ్యర్థిగా రెండో సెగ్మెంట్లో నామినేషన్ వేసిన యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం
కోడూరు మండలం ఎంపీపీ అభ్యర్థిగా రెండవ సెగ్మెంట్ లో వైయస్సార్సీపి బలపరిచిన అభ్యర్థిగా యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ నామినేషన్ వేశారు. శుక్రవారం కోడూరులో ఆయన వైసిపి నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట అవనిగడ్డ నియోజకవర్గం సోషల్ మీడియా అధ్యక్షుడు రామకృష్ణ, కోడూరు మండల కన్వీనర్ పరిశే మాధవరావు, T మహేష్, వీరితో పాటు పెద్దసంఖ్యలో మండలంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.