భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..అమరావతి ఇక మెగా సిటీ: సీఎం చంద్రబాబు…

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ : ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి తీరుతామని సీఎం చంద్రబాబు అన్నారు. 2029లోపు వందశాతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. బుర్రిపాలెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘సంక్షేమం, అభివృద్ధితోపాటు ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం.
గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని భ్రష్టు పట్టించింది. నివాసయోగ్యం కాని ఇళ్లను మంజూరు చేస్తే ఎవరికైనా లాభం వస్తుందా? అమరావతి ఇక మెగా సిటీగా మారనుంది. ఫిబ్రవరి 3న కీలక అడుగు పడనుంది. క్వాంటం వ్యాలీ దిశగా అమరావతి అడుగులు వేస్తోంది’ అని అన్నారు..
