భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..బ్రేకింగ్ న్యూస్…
ఐసీయూలో ఎల్కే అద్వానీ..!
అపోలో ఆసుపత్రిలో చికిత్స..!
భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ (98) ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.
ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అద్వానీ త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.