కృష్ణా కరకట్ట బలోపేతం, నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణా కరకట్ట బలోపేతం, నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు

58.500 కిలోమీటర్ల కరకట్ట అభివృద్ధికి రూ.136.25 కోట్లు ఆర్థికశాఖ ఆమోదం

కృష్ణా కరకట్ట బలోపేతం, నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి 58.500 కిలోమీటర్ల కరకట్ట అభివృద్ధికి రూ.136.25 కోట్లు మంజూరుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. కృష్ణా కరకట్ట ప్రధాన రహదారి పునర్నిర్మాణ ఆవశ్యకతను కొద్ది నెలల క్రితం జరిగిన కృష్ణాజిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా, సీఎం చంద్రబాబు అదే సమావేశంలో రాష్ట్ర ఉన్నత అధికారులకు కరకట్ట రోడ్డు పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు విజయవాడ వెళ్లేందుకు కీలకమైన రవాణా మార్గంగాను, కృష్ణానది పరివాహక గ్రామాలకు రక్షణ కవచంగాను నిలిచే కరకట్ట ప్రధాన రహదపులిగడ్డ నుంచి విజయవాడ వరకూ ఉన్న కృష్ణానది కరకట్ట 58.500 కిలోమీటర్లు పొడవునా బలోపేతం చేసేందుకు, బీటీ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.136.25 కోట్లు నిధులు మంజూరుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందని తెలిసింది.