ఈనెల 15న చల్లపల్లి లోని ఆర్ & డి ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, జడ్ పి హెచ్ ఎస్ స్కూల్ దగ్గర జాబ్ మేళా..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఈనెల 15న చల్లపల్లి లోని ఆర్ & డి ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, జడ్ పి హెచ్ ఎస్ స్కూల్ దగ్గర జాబ్ మేళా..

-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
-జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.15.10.2026 గురువారం నాడు ఉదయం 09:00 గంటలకు
చల్లపల్లి లోని ఆర్ & డి ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, జడ్ పి హెచ్ ఎస్ స్కూల్ దగ్గర “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు తెలియజేశారు.

ఈ జాబ్ మేళాలో ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ముత్తూట్ మనీ లిమిటెడ్,ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అపోలో ఫార్మసీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్విన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అడేక్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యూ ఎన్ వో మిండా లిమిటెడ్, పేటిఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని, 380కు పైగా వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ గారు తెలిపారు.

ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, సెప్టెంబర్ 19న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్సైట్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 63006 18985, 99664 89796, 90005 71662 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.