భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……విశాఖపట్నంలో అక్టోబర్ 25న ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ….
అక్టోబర్ 25వ తేదీన రెడ్ క్రాస్ సొసైటీ మరియు రోటరీ ఎల్ఎన్-4 హ్యాండ్ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లు, ఎలక్ట్రికల్ మరియు రైలు ప్రమాదాలలో చేతులు కోల్పోయిన బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంప్రదించాల్సిన నంబర్: 8866306969 (ఫోన్ / వాట్సాప్)
అర్హులైన వారు తమ ఫోటోలతో సహా ఈ నంబర్‌ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను పదిమందికి షేర్ చేయడం ద్వారా ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన నిరుపేదలకు సహాయపడాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఈగల్ (EAGLE) బృందం కూడా సహకరిస్తోందని, ఏవైనా సందేహాల కోసం ఈగల్ కాల్ సెంటర్ నంబర్ 1972 ను సంప్రదించవచ్చని తెలిపారు.