నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ సన్నద్ధం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ సన్నద్ధం

వచ్చే ఏడాది ఆరంభంలో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది.

ఈ వారం సీనియర్ అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్ల తనిఖీ ప్రక్రియను పరిశీలించనున్నారు.

ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువు మార్చిలో ముగియనుండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 22తో ముగియనుంది.