భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం….స్టేట్ ఎలక్షన్ ఆఫీస్ మీడియా సమావేశం
SEC అనిల్ చంద్ర పునేత కామెంట్స్.
మొదటి దశలో 100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించాం.
పెండింగ్లో ఉన్న 23 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలు జరుగుతాయి.
శ్రీకాకుళం,కాకినాడ, రాజమండ్రి,మంగళగిరి తాడేపల్లి,కార్పొరేషన్లతో పాటు 19 మున్సి పాలిటీలకు ఎన్నికలు.
అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో ఎన్నికలకు 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.
17వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ.
19 వ తేదీన నామినేషన్ల విత్ డ్రా.
26వ తేదీన పోలింగ్.
30 వ తేదీన కౌంటింగ్.
ఏపీలో గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు.
పంచాయతీ ఎన్నికలకు రేపు మొదట దశ నోటిఫికేషన్ ఇస్తాం
మొదట దశలో పంచాయతీ ఎన్నికలకు 26వ తేదీన పోలింగ్ అదే రోజున ఫలితాలు.
రెండో దశ పంచాయతీ ఎన్నికలకు 29 వ తేదీన పోలింగ్ అదే రోజు ఫలితాలు.
మూడో దశ పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 2వ తేదీన పోలింగ్ అదే రోజు ఫలితాలు.

సుప్రీం కోర్టు ఆదేశాలతో నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నాం
అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.
అభ్యర్ధులు నామినేషన్లు స్వేచ్ఛగా దాఖలు చేసే బాధ్యత పూర్తిగా జిల్లా యంత్రాంగానిదే.
ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి అన్ని ఏర్పాట్లు చేశాం.
పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ సెంటర్ల వరకు, భద్రత కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం.
శాంతి భద్రతలకు విఘాతం కలిగే చోట ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగేలా చూస్తాం.
SIR ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నాం తప్పని సరి పరిస్థితుల్లో ముందే ఎన్నికలు నిర్వహించాం.
MPTC, ZPTC ఎన్నిక కోసం SEC నుంచి 100 శాతం ఏర్పాట్లు చేశాం.
పొలిటికల్ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల వరకు పూర్తి సహకారం ఉంది.
సున్నిత ప్రాంతాల్లో అభ్యర్థుల నామినేషన్లను పోలీసుల భద్రత నడుమ దాఖలు చేయిస్తాం.
ఎన్నికల్లో చెలరేగిన హింసపై SEC కీలక వివరణ.
పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎస్పీలతో 14వ తేదీన సమావేశం నిర్వహిస్తామన్న SEC
విశాఖలో ఓట్ల పెరుగుదల వివాదంపై SEC.
పోలింగ్ స్టేషన వారిగా ఓటింగ్ వివరాలు వెల్లడించడం జరిగింది.
వ్యాలిడ్ ఓటింగ్ అంత చెక్ చేసి ఫైనల్ ఓటింగ్ ఇచ్చాం.
గత స్థానిక సంస్థల ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగింది.