చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష –

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష – కందుకూరు సమీపంలోని చుట్టుగుంట గ్రామానికి చెందిన కండ్రా హరిబాబుకు కందుకూరుకోర్టు జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

కందుకూరుకు చెందిన బత్తిన మాల్యాద్రికి, 2015 లో కండ్రా హరిబాబు 10 లక్షలకు చెక్కు ఇచ్చారు. ఇచ్చిన చెక్కు చెల్లలేదని, కందుకూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో బత్తిన మాల్యాద్రి కేసు వేశారు. C.C 535/2015 గా రిజిస్టర్ అయిన కేసు విచారణ పూర్తికాగా, 26.10.2026 న తుదితీర్పు ఇచ్చారు.

హరిబాబుకు 10,10,000/- రూ (పదిలక్షల పది వేలు)జరిమానా మరియు 6నెలలు జైలు శిక్ష విధించారు.