25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన ఆయన సేవలను నేడు ఢిల్లీ లో కలిసిన సందర్భంగా కొనియాడారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor.ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని చూపారని, క్రమశిక్షణ, నిబద్ధతతో దేశానికి సేవలు అందించారని అన్నారు. దూరదృష్టి, స్పష్టమైన లక్ష్యం, ధృడమైన నిర్ణయాలు, సమర్థవంతమైన పాలనతో భారత్‌ను ప్రపంచ శక్తిగా మలిచారని కీర్తించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో భారత దేశ గమనాన్ని మర్చారని సిఎం అన్నారు.

ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా చేసి వికసిత్ భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ గౌరవాన్ని, విశ్వసనీయతను మరింత పెంచేలా తోడ్పడ్డారని అన్నారు. రాష్ట్ర ప్రజల తరుపున ఈ సందర్భంగా ప్రధానికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.