భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….పింఛనుదారులకు అలర్ట్.. నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ వార్షిక జీవన్ ప్రమాణ్ పత్రం (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్)ను నవంబర్ 30, 2026లోపు తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ గడువును అతిక్రమిస్తే డిసెంబర్ నెల నుండి పింఛన్ నిలిచిపోయే అవకాశం ఉంది.
కాబట్టి పింఛన్‌దారులు ఉమాంగ్ యాప్, జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్‌తో లేదా పోస్టాఫీసు, బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ సర్టిఫికెట్ సమర్పించవచ్చు.

గడువు దాటితే పింఛను ఆగిపోయినా, తర్వాత సర్టిఫికెట్ ఇస్తే బకాయిలు జమవుతాయి….