భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఖమ్మంలో కత్తులు, గొడ్డళ్లతో యువకుల హల్చల్.. రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు!
ఖమ్మం నగరంలో సోషల్ మీడియా లైకులు, వ్యూస్ కోసం కత్తులు, గొడ్డళ్లతో విన్యాసాలు చేస్తూ భయాందోళనలు సృష్టించేలా వీడియోలు రూపొందిస్తున్న ఇద్దరు యువకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పంపింగ్ వెల్ రోడ్డు ప్రాంతానికి చెందిన దొడ్ల చరణ్, దమళ్ల సూర్యలను పోలీసులు పట్టుకుని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.

ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం మారణాయుధాలతో వీడియోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత ఇలాంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.