జల్లేరు ఎర్రకాలువలో 20 కిలోల భారీ చేప

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..జల్లేరు ఎర్రకాలువలో 20 కిలోల భారీ చేప

రూ.7 వేలకుపైగా ధర పలికిన భారీ చేప

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని జల్లేరు ఎర్రకాలువలో మత్స్యకారుల వలకు సుమారు 20 కిలోల భారీ చేప చిక్కింది. భారీ పరిమాణంలో ఉన్న ఈ చేప స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

వేగవరం గ్రామానికి చెందిన కొబ్బరికాయల వ్యాపారి, రైతు గంటికూటి చిన్న ఈ భారీ చేపను రూ.7,000కు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాలువలో ఇంత పెద్ద చేప చిక్కడంతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు….