ఢిల్లీలో భారీగా నకిలీ పన్నీర్ పట్టివేత.. సీఎం రేఖా గుప్తా ఆగ్రహం!

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….ఢిల్లీలో భారీగా నకిలీ పన్నీర్ పట్టివేత.. సీఎం రేఖా గుప్తా ఆగ్రహం!

ఢిల్లీలో కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నకిలీ పన్నీర్ పట్టుబడింది. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పట్టుబడిన నకిలీ పన్నీర్‌ను స్వయంగా ట్రక్కులో వేసిన సీఎం.. దానిని పూర్తిగా ధ్వంసం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు…..