భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,
Crime new krishna :
- గన్నవరం జడ్పీ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాల సందర్శన
- పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన – పోలీస్ అధికారులకు పలు సూచనలు
- జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా పోలింగ్
కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు, గన్నవరం డీఎస్పీ శ్రీ జయకృష్ణ గారు ఇతర పోలీస్ అధికారులతో కలిసి గన్నవరం జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
తదుపరి ఎస్పి గారు బుద్దవరం, దావాజీ గూడెం పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి, విధుల్లో ఉన్న గన్నవరం మండల పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల విధుల్లో పోలీస్ సిబ్బందితో పాటు మహిళా సంరక్షణ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు, జాతీయ సేవా పథకం (NSS) విద్యార్థులు కూడా చురుకుగా పాల్గొంటూ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తున్నారని తెలిపారు.
ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.
కృష్ణా జిల్లా పోలీస్
కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన జడ్పిటిసి, ఎంపిటిసి పోలింగ్ ప్రక్రియ
- ఏ చిన్న సంఘటనకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తి
- విధుల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు
- కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి
కృష్ణా జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఏ చిన్న సంఘటనకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ముగిసింది. ప్రజలు తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఎన్నికల విధుల్లో అంకితభావంతో…