భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ఈడీ సోదాలు..
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన అక్రమాల కేసులో ఈరోజు ఉదయం నుంచి ఈడీ సోదాలు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం.
ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులో ఈడీ సోదాలు.
గ్రూప్-1 మూల్యాంకనంతో సంబంధమున్న క్యామ్‌సైన్ మీడియా, ఇతర ప్రైవేట్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి.
గ్రూప్-1 మూల్యాంకనానికి చెల్లించిన నిధులు, కాంట్రాక్టుల కేటాయింపులు, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై ఈడీ విచారణ.
2018లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. 2020 డిసెంబర్లో మెయిన్స్ పరీక్షలు.

గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలకు డిజిటల్ మూల్యాంకనంతో పాటు రెండు దశల్లో మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు సిట్ నివేదిక.
మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో 84 రోజులపాటు గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనం జరిగినట్లు సిట్ గుర్తింపు.
అర్హత లేని 66 మందితో గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనం చేయించారన్న సిట్ ఆరోపణ.
గ్రూప్-1 మూల్యాంకనానికి క్యామ్‌సైన్ మీడియాకు రూ.1.14 కోట్లు, డిజిటల్ మూల్యాంకన సంస్థలకు రూ.1.38 కోట్లు చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడి.
గ్రూప్-1 మూల్యాంకన పత్రాల్లో 287 బార్కోడ్ అసమానతలు, 169 స్లిప్పుల్లో కరెక్షన్ ఫ్లూయిడ్ వినియోగాన్ని గుర్తించినట్లు సిట్ నివేదిక.
గ్రూప్-1 మూల్యాంకన అక్రమాల కేసులో 173 మంది సాక్షులను విచారించి, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించిన సిట్.
గ్రూప్-1 మూల్యాంకన అక్రమాలపై 2025 ఏప్రిల్‌లో పోలీసు కేసు నమోదు.. పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా డైరెక్టర్ మధుసూదనరావు గతంలో అరెస్టు.
గ్రూప్-1 మూల్యాంకన వివాదంపై హైకోర్టులో న్యాయపోరాటం.. సిట్ దర్యాప్తు నివేదిక, మూల్యాంకన పత్రాలపై విచారణ.
సిట్ దర్యాప్తు నేపథ్యంలో 2026 అక్టోబర్‌లో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు. తాజాగా సోదాలు..