భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఫేస్బుక్ ఫేక్ అకౌంట్‌తో కానిస్టేబుల్‌కు రూ.29.20 లక్షల టోకరా
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు ఫేస్బుక్లో ‘సుకన్య రెడ్డి’ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వాట్సాప్‌లో పరిచయం పెంచుకున్న మహిళ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో వల వేసింది.
‘డార్విన్ ఎక్స్ గ్లోబల్’ సంస్థలో మొదట చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చినట్లు చూపించారు. దీంతో నమ్మిన కానిస్టేబుల్ విడతలవారీగా రూ.29.20 లక్షలు పెట్టుబడి పెట్టాడు.

రూ.76 లక్షల లాభం వచ్చిందని, విత్‌డ్రా చేసుకోవాలంటే రూ.12 లక్షల ఫీజు కట్టాలని చెప్పడంతో మోసం బయటపడింది. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.