ఒక్కరోజులోనే రూ.50 వేల కోట్లకు పైగా పెరిగిన ముకేశ్ అంబానీ సంపద.

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….ఒక్కరోజులోనే రూ.50 వేల కోట్లకు పైగా పెరిగిన ముకేశ్ అంబానీ సంపద.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్‌లో భారీగా పుంజుకోవడంతో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ సంపద ఒక్కరోజులోనే 6 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన మొత్తం సంపద 88.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 23వ స్థానానికి చేరుకున్నారు.

సోమవారం రిలయన్స్ షేర్లు ఏకంగా 11.6 శాతం పెరిగాయి. గత ఆరేళ్లలో షేర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఈ పరిణామంతో గౌతమ్ అదానీని అధిగమించిన ముకేశ్ అంబానీ మరోసారి దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.