భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……కార్పోరేషన్ ఎన్నికల బరిలో హీరో జగపతి బాబు సోదరి
ఏపీలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గుంటూరు మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గెలుపు కోసం సినీ నటుడు జగపతి బాబు ప్రచారం చేపట్టారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో తన సోదరిని సమర్థురాలిగా అభివర్ణించిన ఆయన, గత సాధారణ ఎన్నికల్లో మాదిరిగానే కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తన సోదరి గుంటూరు అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్న జగపతి బాబు ప్రచారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
