భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం….తిరువూరు
లక్ష్మీపురంలో రోడ్డు ప్రమాదం..
డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కర్రల లారీ…
లక్ష్మీపురం గ్రామంలోని వాటర్ ట్యాంక్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కర్రల లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.

తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది.