భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్.కేటీఆర్ పై గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటన. అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో అలా మాట్లాడాను తప్ప ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. ఆనాడు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. కేటీఆర్ ని గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ బాధపెట్టాలని, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను – కొండా సురేఖ
