భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..లేస్ చిప్స్ ప్యాకెట్‌పై ఫిర్యాదు.. పెప్సికోకు వినియోగదారుల కమిషన్ షాక్!
రాజస్థాన్‌లోని జైపూర్ వినియోగదారుల కమిషన్ లేస్ చిప్స్ ప్యాకెట్‌పై వచ్చిన ఫిర్యాదులో కీలక తీర్పు వెలువరించింది.
రూ.5 విలువైన 15 గ్రాముల ప్యాకెట్లో కేవలం 4 గ్రాముల చిప్స్ మాత్రమే ఉన్నాయని 2022 ఏప్రిల్ 6న ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ.5 మొత్తంపై ఫిర్యాదు తేదీ నుంచి చెల్లించే వరకు ఏటా 6 శాతం వడ్డీ చెల్లించాలని పెప్సికో సంస్థను కమిషన్ ఆదేశించింది.
అంతేకాకుండా, మానసిక వేదనకు పరిహారంగా రూ.5,000, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ.3,000 చెల్లించాలని ఆదేశించింది.

చిన్న మొత్తమే అయినా.. వినియోగదారుల హక్కుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పరిహారం చెల్లించాల్సిందేనని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.