భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..మహిళ కన్నీటికి చలించిన ఎమ్మెల్యే చింతమనేని – అట్లతద్ది వాయినాల సరుకుల కోసం తెచ్చుకున్న ₹20 వేలు పోగొట్టుకున్న మహిళకు కొండంత అండ.
- ఏలూరు టూ టౌన్ పీఎస్‌కు వెళ్లిన బాధితురాలు – తమ స్టేషన్ పరిధి కాదంటూ పోలీసులు చెప్పడంతో మహిళ ఆవేదన – విషయం తెలిసి నేరుగా పీఎస్‌కు చేరుకుని పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని.
- సీసీ ఫుటేజ్ ఆధారంగా తక్షణమే కేసు ఛేదించాలని సూచన – టూ టౌన్ ఇన్‌స్పెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి కేసు నమోదు చేసి నిందితులను త్వరగా పట్టుకోవాలని స్పష్టీకరణ.
- స్వయంగా తన జేబులోంచి ₹20 వేల నగదు సాయం – పండుగ పూట కన్నీరుమున్నీరవుతున్న మహిళకు పోలీస్ స్టేషన్ వద్దే తక్షణ ఆర్థిక భరోసా కల్పించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
- చింతమనేని పెద్ద మనసుకు ప్రశంసలు – పోలీసులు డబ్బులు రికవరీ చేశాక తనకు తిరిగి ఇవ్వవచ్చని, ముందుగా వెళ్లి సరుకులు కొనుక్కోమని చెప్పి ఓదార్పు.

ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్:
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మరోసారి తన ఉదారతను, మానవత్వాన్ని చాటుకున్నారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన చలమాల రాజేశ్వరి అనే మహిళ..